- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
library : నాగారంలో గ్రంథాలయం ప్రారంభం..
దిశ, కీసర : నాగారం మున్సిపాలిటీలోని నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎండీ రియాజ్, గ్రంథాలయ డైరెక్టర్ ఏవిఎన్ రాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో కావలసిన పుస్తకాలను ఎప్పటికప్పుడు పంపించేటట్టు కృషి చేస్తామని, ఎల్లప్పుడూ గ్రంథాలయ అభివృద్ధికి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారికి గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, సీనియర్ సిటిజన్స్ ప్రతిఒక్కరు కూడా గ్రంథాలయంను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్, కౌన్సిలర్లు సుర్వి శ్రీనివాస్ గౌడ్, పంగ హరిబాబు, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కౌకుట్ల అనంత రెడ్డి, నాయకులు మోకు జగన్మోహన్ రెడ్డి ,గూడూరు ఆంజనేయులు గౌడ్, కొమిరెల్లి సుధాకర్ రెడ్డి, కౌకుట్ల కృష్ణారెడ్డి, అన్నం రాజు శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు అశోక్ గౌడ్, షఫీ, మేడ్చల్ మల్కాజ్గిరి గ్రంథాలయ సెక్రటరీ సురేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.