అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. అదే కారణమా..?

by Satheesh |   ( Updated:2023-03-27 03:39:43.0  )
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. అదే కారణమా..?
X

దిశ, మేడిపల్లి: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్ధ నగర్‌కు చెందిన వసంతకుమార్ (30) మల్బర్ గోల్డ్‌లో పనిచేస్తున్నాడు. కాగా, సోమవారం ఉదయం మేడిపల్లి శాంతివనం పార్క్ రెండవ గేటు బయట గల చెట్టుకు ఉరేసుకుని వసంతకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉదయం వాకింగ్‌కి వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పంచనామా నిర్వహించి మృదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మృతుని ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించారు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం తల్లి మరణించడంతో అప్పటి నుండే డిప్రెషన్‌లో ఉన్నాడంటూ బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని మేడిపల్లి ఎస్‌ఐ సందీప్ తెలిపారు.

Advertisement

Next Story