ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ టవర్ అపార్ట్మెంట్ యజమానుల ధర్నా..

by Sumithra |
ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ టవర్ అపార్ట్మెంట్ యజమానుల ధర్నా..
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ లోని ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ కార్యాలయం వద్ద ఒప్పందం ప్రకారం వసతులు కల్పిస్తలేరని ప్లాట్ యజమానులు ధర్నా నిర్వహించారు. ఉప్పల్ లోని ఎన్ఎస్ఎల్ కంపెనీలో ప్లాట్లు కొనుగోలు సమయంలో యజమానులకు ఇచ్చిన హామీల ప్రకారం వసతులు కల్పించడం లేదంటూ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. కానీ నిబంధన ప్రకారం వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ టవర్ లోని ప్లాట్లలో భారీగా వాటర్ లీకేజీలు జరుగుతున్నాయని అన్నారు. 24 అంతస్తుల టవర్ లో కనీస వసతులు, తాగునీరు సరిగా రావడం లేదని, ఫైర్ సేఫ్టీ, వాక్ ఏరియా, గ్రీనరి, కిడ్స్ ప్లే, రూఫ్ గార్డెన్ కనీస వసతులు లేవని పేర్కొన్నారు.

ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ అపార్ట్మెంట్ కు అప్రోచ్ ప్రధాన రహదారి లేకపోవడం ఆశ్చర్యమన్నారు. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కు రేరా, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని ఫ్లాట్ యజమానులు మండిపడుతున్నారు. టవర్ ఏలో 456 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. ప్లాట్ లలో సంవత్సర కాలంగా నివసిస్తున్నా కూడా వసతులు కల్పించడంలో ఎన్ఎస్ఎల్ కంపెనీ విఫలమైందన్నారు. తక్షణమే ఎన్ఎస్ఎల్ యాజమాన్యం జోక్యం చేసుకొని మాకు ఒప్పందం ప్రకారం ఇచ్చిన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్వీ రమణ, డాక్టర్ వెంకటేష్, విజయ్, రాము, ముఠాల సురేంద్ర, నాగు వెంకటేష్ రావు, పురోషోత్తం, జితేంద్ర, మంజుల, సత్యవాణి, సుజాత, పుష్ప, స్వప్న, ప్రతిభ, రూప, ప్రత్యుష ప్లాట్ యాజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story