- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
31 ఏళ్ల నటితో డేటింగ్.. అవును ప్రేమించుకుంటున్నామంటూ బిగ్ బాంబ్ పేల్చిన 71 ఏళ్ల నటుడు
దిశ, సినిమా: రీసెంట్‌గా నటి శివంగి వర్మ ప్రముఖ 70 ఏళ్ల నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. “ప్రేమకు వయసు, పరిమితులు లేవు” అంటూ రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అయితే తాజాగా ఈ పుకారుపై నటుడు గోవింద్ నామ్‌దేవ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అవును ప్రేమించుకుంటున్నాం. కాకపోతే నిజ జీవితంలో కాదు, రీల్ లైఫ్‌లో. మేమిద్దరం ‘గౌరీ శంకర్ గోహర్‌గంజ్’ అనే సినిమాలో నటిస్తున్నాం. ఇండోర్‌లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఓ ముసలి వ్యక్తి యంగ్ లేడితో లవ్‌లో పడతాడు.
అదే ఈ సినిమా కథ. ఈ చిత్రంలో భాగంగానే ఆమె ఆ పోస్ట్ పెట్టింది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే మరో అమ్మాయితో ప్రేమలో పడటమనేది జీవితంలో జరగదు. ఎందుకంటే నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తనే నా ఊపిరి. ఈ జన్మకు తను చాలు. ఆమె ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. నా భార్య కోసం దేవుడితోనైనా యుద్ధం చేస్తా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం గోవింద్ నామ్‌దేవ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.