అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు..

by Aamani |
అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు..
X

దిశ,భూదాన్ పోచంపల్లి: అదుపుతప్పి ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని హైదర్పూర్ గ్రామానికి చెందిన గూడూరు చంద్రారెడ్డి, సగ్గు ఎల్లారెడ్డిలు గత కొంతకాలంగా హైదరాబాదులోని హయత్ నగర్ లో నివాసముంటున్నారు. వీళ్ళిద్దరూ బ్యాంకు పని మీద పోచంపల్లికి వస్తుండగా మార్గమధ్యంలోని జలాల్పురం చెరువు కట్టపై ఉన్న మూలమలుపు కనిపించక కారు చెరువులోకి దూసుకెళ్లింది. వీళ్ళిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Next Story