- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మా అక్కా, బావల నుంచి ప్రాణహాని ఉంది: గోరంట శ్రీనివాస్
దిశ, కాప్రా: మా అక్కా, బావల నుంచి ప్రాణహాని ఉందని కుషాయిగూడ చక్రిపురం కాలనీలో నివాసముంటున్న గోరంట శ్రీనివాస్ ఆరోపించాడు. బుధవారం కాప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ నా స్వస్థలం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం. జీవనోపాధికై కుషాయిగూడ చక్రిపురం కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను బ్రహ్మచారిని కావడంతో నా ఆస్తిని కాజేసేందుకు, నా బావ వి. రవీందర్, అక్క శ్రీలక్ష్మి, వీరి కుమారుడు, వీరి అల్లుడు మహేష్ లు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే గత నెల 26వ తేదీన నా నివాసానికి కొంతమంది కిరాయి రౌడీలతో వచ్చి నన్ను కొట్టి చంపేస్తామని బెదిరించారు. ఈ విషయమై మరుసటి రోజు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. కిరాయి రౌడీలు బెదిరించినట్లు ఆధారాలు చూపించినప్పటికీ పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. వారిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు పెట్టకపోవడం విచారకరం’ అని తెలిపాడు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు శ్రీనివాస్ చెప్పాడు.