- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Eatala : మల్కాజ్గిరి ఓ మినీ ఇండియా
దిశ,ఉప్పల్ : మల్కాజ్గిరిని ఓ మినీ ఇండియాగా మనం పిలుస్తుంటామని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అతి ఎక్కువ ఓటర్లు కలిగిన నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు అన్నారు. 38 లక్షల ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 52 శాతం ఓట్లు సాధించి భారతీయ జనతా పార్టీ ఆజెయమైనదిగా నిలిచిందన్నారు.
సభ్యత్వ నమోదు జరుగుతున్న సందర్భంలో బీజేపీకి వచ్చిన 10 లక్షల ఓట్లలో ఐదు లక్షల సభ్యత్వ నమోదు చేయామని ఆదేశం ఇస్తే ఇప్పటికే మూడు లక్షల పైచిలుకు నమోదు చేసి మొత్తం రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ఈ నియోజకవర్గంలో మూడు జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించామని, పదో తారీకు లోపు సభ్యత్వాన్ని పూర్తిచేయాలని సూచించారు. ఒక్కో బూత్ లో 100కు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రజలకు, అపార్ట్మెంట్లో ఉండే ప్రజలకు, కాలనీలో ఉండేవాళ్లకు, పాలకమండలిలో ఉండేవాళ్లకు పిలిస్తే పలికే బిడ్డగా ఉన్నందునే తనను గెలిపించారని, అదే విశ్వాసంతో సభ్యత్వ నమోదు కూడా చేయాలని కోరారు. వక్ఫ్ బోర్డ్, హైడ్రా, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.