Mlc : కార్మికులకు అండగా ఉంటా

by Sridhar Babu |
Mlc : కార్మికులకు అండగా ఉంటా
X

దిశ, అల్వాల్ : జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ కార్మికులకు (Outsourcing labor)అండగా ఉంటానని, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పోరాడుతామని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం (MLC Kodandaram)అన్నారు. మంగళవారం అల్వాల్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కార్మికులు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పోరాడుతామని తెలిపారు.

పర్మినెంట్, తాత్కాలిక సిబ్బంది కార్మికులందరికీ తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేవిధంగా ప్రభుత్వంను కోరుతామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల కార్మిక నేతలు, కార్మికులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం అల్వాల్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీని ఆయన సమక్షంలో ప్రకటించి వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదు సత్యం గౌడ్, ఆకుల శ్రీనివాస్, జగదీష్, అశోక్ రెడ్డి, అల్వాల్ ఔట్ సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు ముత్యాల వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఏ.రాజు, జనరల్ సెక్రటరీ బీఐ శ్రీనివాస్, యూనియన్ నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed