అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి..

by Kalyani |
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి..
X

దిశ, ఉప్పల్: చిలుకానగర్ గవర్నమెంట్ స్కూల్ వెనకాల రూ. 12 లక్షల వ్యయంతో చేపడుతున్న శివరేజ్ పైప్ లైన్ పనులకు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ తో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ లోని వాటర్ పొల్యూషన్ ఉన్న ప్రధానమైన హాట్ స్పాట్ లు గుర్తించి వాటన్నింటినీ నూతన పైపులైన్ ద్వారా మంచినీటి కాలుష్యాన్ని నివారిస్తున్నామని, మంచినీటి లో ప్రెజర్ ఉన్న ప్రాంతాలన్నింటినీ నూతన పైపులైన్ వేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బజార్ జగన్, బరంపేట్ రమేష్, ఏదుల్ల కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్, పండ్ల కిషన్ గౌడ్,బింగి శ్రీనివాస్, ఫోటో బాలు, బాలేందర్, ఎండి షఫీ, కుమార్, రామచందర్, రామానుజన్, వర్మ, గౌస్ బాయ్, బీరప్ప గడ్డ బాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed