కళాశాలకు వెళ్లిన బీకాం విద్యార్థిని అదృశ్యం..

by Vinod kumar |
కళాశాలకు వెళ్లిన బీకాం విద్యార్థిని అదృశ్యం..
X

దిశ, కూకట్​పల్లి: కళాశాలకు వెళ్లిన బీకాం విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కూకట్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్​కాలనీ వెంకట పాపయ్య నగర్​కాలనీలో నివాసం ఉంటున్న కోరెముల నాగరాజుకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు కే. లికిత రమా(19) కూకట్​పల్లి ఏఎస్ ​రాజు నగర్ ​కాలనీలోని అవినాష్​కళాశాలలో బీకాం చదువుతుంది.

ఈ క్రమంలో రమా 14వ తేది ఉదయం రోజువారీ మాదిరిగా కాలేజీకి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు, తెలిసిన వారి బంధువుల వద్ద గాలించినా ఫలితం లేక పోవడంతో కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, తన స్నేహితురాలు జ్యోతి తో రమా కళాశాల నుంచి తిరిగి ఇంటికి బయలు దేరిందని తెలిసినట్టు నాగరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింగరావు తెలిపారు.

Advertisement

Next Story