Medchal: జవహర్‌నగర్‌పై మంత్రి మల్లారెడ్డి వరాల జల్లు

by srinivas |   ( Updated:2023-09-03 12:06:29.0  )
Malla Reddy
X

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌పై మంత్రి మల్లారెడ్డి హామీల వర్షం కురిపించారు. ఇవాళ జవహర్‌నగర్ ఏరియాలో పర్యటించిన ఆయన స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ యువతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. యువత స్పోర్ట్స్ వైపు దృష్టిసారించేలా స్థలం కేటాయించి మరీ స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో జవహర్‌నగర్ రూపురేఖలు మార్చేస్తానని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలోనే నెంబర్ వన్ పట్టణంగా మారుస్తానని చెప్పారు. జవహర్ నగర్‌లో పార్కుతో పాటు వైకుంఠధామం పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధి పథంలో జవహర్ నగర్‌ను ముందుండేలా తాము కృష్టి చేస్తామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story