ఆత్మన్యూనత వద్దు.. ఆత్మస్థైర్యమే ముద్దు..

by Sumithra |
ఆత్మన్యూనత వద్దు.. ఆత్మస్థైర్యమే ముద్దు..
X

దిశ, జవహర్ నగర్ : దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగుల సంక్షేమాన్ని అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ దివ్యాంగుల పించన్ మరో వెయ్యి రూపాయలు పెంచిన సందర్భంగా ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని దివ్యాంగులు, మంత్రిమల్లారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు, త్రీ వీలర్ స్కూటీలు, చేతికర్రలు మొదలైనవి సమకూరుస్తూ రోజువారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దివ్యాంగుల అత్మగౌరవాన్ని, అత్మస్థైర్యాన్ని, సాధికారతను పెంచే దిశగా, అవసరమైన అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని తెలిపారు.

రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. దివ్యాంగులను మనలో ఒకరుగా ఆదరిస్తూ, వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం దివ్యాంగులతో కలిసి వారికి భోజనం తినిపిస్తూ స్పెషల్ ఎఫెక్ట్స్ గా నిలిచారు మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, దమ్మాయి గూడ మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీతా శ్రీకాంత్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

పనులకు శంకుస్థాపనలు..

జవహర్ నగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మంచి పట్టణంగా తీర్చిదిద్దామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 15, 26, 27, 25, 23, 24, 22, 28, 3, 19, 18, 16 డివిజన్లలో పలు సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed