- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐటీ అధికారులకు సహకరిస్తా.. Minister Malla Reddy
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఐటీ అధికారులకు సహకరిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఐటీ విచారణకు హాజరవుతారని ఆయన చెప్పారు. ఉప్పల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. ఐటీ వాళ్లు వదిలిన మీడియా వాళ్లు మాత్రం తనను వదలడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఐటీ విచారణపై తానిప్పుడే ఏం మాట్లాడలేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందునా తాను ఇవాళ ఐటీ విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తన తరఫున ఆడిటర్ హాజరవుతారని స్పషం చేశారు. కాగా.. మల్లారెడ్డి తో సహా 16 మంది ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది కూడా నోటీసులు ఇచ్చారు. వారందిరినీ సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. ఐటీ సోదాల్లో లభ్యమైన కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్సకి సంబంధించిన వివరాలను కూడా తీసుకురావాలని కోరారు. తాజాగా ఐటీ విచారణలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ డైరెక్టర్ రామస్వామి పాల్గొన్నారు.
నేను విచారణకు హాజరవుతా.. మర్రి రాజశేఖర్ రెడ్డి
ఐటీ విచారణకు నేడు హాజరుకానున్నట్లు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తాను ఐటీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరవుతానని వారికి సహకరిస్తానని వెల్లడించారు. మూడు రోజుల క్రితమే తనకు సమన్లు అందాయని, ఐటీ అధికారులకు అన్ని విధాల సహకరిస్తానని వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది తన పరిధిలోని విషయం కాదని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.