- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వేలో మామకు అనుకూలం.. అల్లుడికి ప్రతికూలం
దిశ ప్రతినిధి, మేడ్చల్ : తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఈ సారి ఓటరు నాడి ఎలా ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అందరూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఎదురు చూశారు. అయితే, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు ఓటమి తప్ప దని, కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి.
మల్కాజ్‌గిరి హస్తం వైపు మొగ్గు..
అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ సెగ్మెంట్ స్థానం హాట్ టాపిక్‌గా మా రింది. బీఆర్ఎస్ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనతోపాటు మెదక్ అసెంబ్లీ సీటును తన కొడుకు రోహిత్‌కు కేటాయించాలని కోరారు. అధిష్టానం ససేమిరా అనడంతో పార్టీకి రాజీనామా చేసి, హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ మైనంపల్లికి 2 టికెట్లను కేటాయించింది. మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనుకుంది. దీంతో మంత్రి మల్లారెడ్డి స్వయాన అల్లుడు మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిని పోటీలో నిలిపింది. టికెట్ ఖరారు కాక ముందు నుంచే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఆయనకు ఎంబీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో మైనంపల్లి వర్సెస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. రాజకీయ విమర్శల స్థాయి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. దీంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే టాక్ ఆఫ్ ద సెగ్మెంట్ గా నిలిచింది. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో ఈ సీటును కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువ మొత్తంలో చీల్చినట్లయితే బీఆర్ఎస్ బయటపడే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
జిల్లాలో గులాబీకే మెజారిటీ సీట్లు..
మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్‌లలో 3 సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు వెల్లడిస్తున్నాయి. మేడ్చల్, ఉప్పల్ తో పాటు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ గానీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. కూకట్‌పల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన బిగ్ ఫైట్ ఉండగా, కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కొన్ని సర్వేలు, బీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే నివేదికలు ఇచ్చాయి. దీంతో మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రెండు అంతకంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే వీలుంది. కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. దీంతో పాటు కుత్బుల్లాపూర్‌లోనే బీఆ ర్ఎస్, కాంగ్రెస్ బీజేపీలలో ఏదో ఒక పార్టీ గెలువనుందని తేల్చి చెబుతున్నాయి.
సర్వే ఫలితాలు ఇలా...
పీటీఎస్ గ్రూప్ సర్వే ప్రకారం..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు సమానంగా సీట్లు గెలుస్తాయని పేర్కొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 5 నుంచి 7 సీట్లు గెలుస్తాయని, బీజేపీ 2 సీట్లు గెలుస్తుందని ప్రకటించింది.
పల్స్ టుడే సర్వే ప్రకారం..
మేడ్చల్, ఉప్ప ల్‌లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంది. అయితే మల్కాజ్‌గి రిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోటీ ఉంటుందని అంచనా వేసింది. ఇకపోతే కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని పేర్కొంది. కూకట్‌పల్లిలో బీఆర్ఎ స్, కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా తలపడ్డాయని తెలిపింది.
కేస్ స్టడీస్ చేసిన సర్వే ప్రకారం..
మేడ్చల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి విజయం సాధిస్తుండగా, మల్కాజిగిరిలో తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఓట మి పాలు కానున్నారని తేలింది. అదే విధంగా కుత్బుల్లాపూర్‌లో బీజేపీ విజ యం సాధిస్తుందని చెప్పింది.కూకట్‌పల్లి లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, ఉప్పల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన పోటా పోటీ ఫైట్ ఉంటుందని చెప్పింది.
సీ ప్యాక్ సర్వే ప్రకారం..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 8 సీట్లను బీఆర్ఎస్, 5 సీట్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగా, బీజేపీ సీటు గెలుస్తుందని పేర్కొంది.
అరా ప్రీఫోల్ సర్వే ప్రకారం..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 7 నుంచి 8 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 7 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకోనుందని తెలిపింది.