- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ గెలుపునకు దోహదపడతాయి.. మర్రి రాజశేఖర్ రెడ్డి
దిశ, మల్కాజిగిరి : కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు దోహదపడతాయని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేత రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మరి రాజశేఖర్ రెడ్డి తో పాటు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రామ యాదవ్, సర్కిల్ ఎన్నికల ఇంచార్జ్ ఆర్ జితేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరిలో దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఆర్యుబీ మౌలాలి కమాన్ ముంపు నివారణ ప్రతి కాలనీలో మౌలిక వసతులు మంచినీటి సమస్య పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వేదపండితులతో ఆశీస్సులు తీసుకున్న మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని సఫీల్ గూడ, నేరేడ్మెట్ చంద్రగిరి కాలనీ వేద పాఠశాలల్లో వేద పండితులచే మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. మౌలాలి కృష్ణ నగర్ లోని మహిళలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక మహిళలు కాలనీలో ఉన్న సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మమత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ కాలంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను రాజశేఖర్ రెడ్డి కచ్చితంగా నెరవేరుస్తాడని రాబోయే ఆరు నెలల్లో సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫహీమ్, మురళి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో..
బీఆర్ఎస్ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి లాలాగూడలో రైల్వే ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ ను మూడవ సారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.