మియాపూర్‌లో మైత్రి రియల్ మోసం..

by Mahesh |
మియాపూర్‌లో మైత్రి రియల్ మోసం..
X

దిశ, మియాపూర్: మైత్రి ప్రాజెక్ట్స్ పేరుతో మియాపూర్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని నిండా ముంచేసింది. సుమారు 300 మంది నుంచి దాదపుగా 50 కోట్లు సేకరించి బాధితులను రోడ్డున పడేశారు. గుంటూర్ కీ చెందిన జానీ భాషా షేక్ తండ్రి మహమ్మద్ జాకీర్, రామంతపూర్ లలితాస్ వినయ్ స్కై సిటీ ప్లాట్ నెం. 505 లో నివాసం ఉంటున్నారు. మియాపూర్‌లో‌ని అల్విన్ చౌరస్తాలో మైత్రి ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించాడు. కాగా హైదరాబాద్‌లో వివిధ వెంచర్ల పేరుతో రాయల్ లీఫ్ - గాగిలాపూర్, రాయల్ ప్యారడైజ్- రామేశ్వర్ బండ, రాయల్ మింట్- మామిడిపల్లి, హాంప్టన్ పామ్స్ - మామిడిపల్లి, ఓపెన్ ప్లాట్లు అమ్ముతామని దొంగ డాక్యూమెంట్ల అగ్రిమెంట్లు చూపించి డబ్బులు కట్టించుకున్నాడు.

ఒక్కొక్కరి వద్ద నుంచి 25 లక్షల మేర కట్టించుకున్నాడు. పెట్టుబడి పెట్టిన వారు ప్లాట్లు అడిగితే ఏదో ఒక సాకు చూపి మూడేళ్ళుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు మకాం మార్చి పారిపోయాడు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు మియాపూర్ ఆల్విన్ చౌరస్తా‌లో గల కార్యాలయంలో ధర్నా చేపట్టి మియాపూర్ పొలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఆయా ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టిన వారంతా మధ్యతరగతి, దిగువ తరగతి చెందిన వాల్లే కావడం గమనార్హం. వారంతా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు.

మాలాగా ఎవరు మోసపోవద్దు..

ఈ డబ్బు సంపాదించు 10 సం రాలు పైనా పట్టింది. మేము అందరం జానీ భాషా షేక్ చేతిలో మోసపోయాం.. మాకు వెంచర్ యజమానుల సహకరించడం లేదు. మా లాగా డబ్బులు ఇచ్చి ఎవరు మోసం పోవద్దు. మాకు న్యాయం చేయాలి.:-రాజ శేఖర్

Advertisement

Next Story

Most Viewed