- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘అల్వాల్’లో ఏరులై పారుతున్న మద్యం.. చోద్యం చూస్తున్న పోలీసులు
దిశ, అల్వాల్ : అల్వాల్ సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలు ఉల్లంఘించి కిరా ణం, కిల్లికొట్టు, కూరగాయల దుకాణాల మాటున మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అమ్మకాలను అరికట్టాల్సిన బాధ్యత తమది కాదంటూనే పోలీసులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి తూతూ మంత్రం గా కేసులు నమోదు చేస్తున్నారు.
ఏ గల్లీ చూసినా ..
పేద మద్యతరగతి వర్గాలకు నిలయమైన అల్వాల్ పరిధిలో మందుబాబులు నిత్యం వీధుల్లో దర్శనమిస్తున్నారు. కొందరైతే రోడ్డు మీదే పడిపోయి కనిపిస్తున్నారు. ఇందుకు 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటమే కారణం. ప్రభుత్వ లైసెన్స్ పొందిన దుకా ణాలు బార్లే కాకుండా బస్తీల్లో గల్లీకో బెల్టు దుకాణం కొనసాగుతుంది. వీటికి అనుబంధంగా కల్తీ కల్లు, గంజాయి విక్రయాలు జోరుగా విక్రయిస్తున్నారు. తుర్కపల్లి, ఇందిరానగర్, వీకర్ సెక్షన్ కాలనీ,కౌకూర్, గోపాల్ నగర్, జొన్నబండ, అంబేద్కర్ నగర్, రాజీవ్ నగర్, పేదలు బలహీన వర్గాల బస్తీల్లో ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి హస్మత్ పేటలో సైతం ఉంది.
శాంతి భద్రతలకు విఘాతం..
బెల్టు దుకాణాల్లో అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగుతుంటంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.బస్తీల్లో ఇళ్ల మధ్య విక్రయాలు కొనసాగుతుండటం వల్ల మందుబాబులు దుకాణం సమీపంలోనే కూర్చుని తాగుతూ గొడవలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి. గతంలో హస్మత్ పేటలో మద్యం మత్తులో అర్థరాత్రి వ్యక్తిపై దాడి చేశారు. అక్రమ మద్యం విక్రయాలను అరిట్టాల్సిన ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. గతంలో గాంధీ జయంతి రోజు పలు బస్తీల్లో మద్యం విక్రయాలు కొనసాగగా పలువురు మహిళలు నిరసన తెలిపారు. వినాయక నిమజ్జనం బోనాల ఉత్సవ సమయాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులకు నిత్యం ఫిర్యాదులు వెళ్లిన పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.
జాడలేని ప్రచార కమిటీలు ..
మద్యపాన నిషేధ ప్రచార కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా యంత్రాంగం పట్టించుకోవడంలేదు గతంలో ప్రాంతాల వారీగా కమిటీలు ఉండేవి జిల్లా స్థాయి కమిటీలతో పాటు పట్టణ కమిటీ సభ్యులు మద్యపానం వల్ల కలిగే నష్టాలపై ఫిర్యాదులు చేసేవా రు కానీ కమిటీ నియమాకాల గురించి యంత్రాంగం మరువడంతో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎక్సైజ్, పోలీస్ అధికారులు స్పందించి సమస్య పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Read More: ఘోర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి