నాయి బ్రాహ్మణ కులవృత్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వ్యక్తిగత అనుచరుడు

by S Gopi |
నాయి బ్రాహ్మణ కులవృత్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వ్యక్తిగత అనుచరుడు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఆరోపణలకు.. ప్రచ్య్యారోపణలు చేసే క్రమంలో ఓ వర్గానికి చెందిన కులవృత్తిని ఉదాహరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఆఖరికి సదరు పోస్టుపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెబుతూ పోస్టును సరి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు వ్యక్తిగత అనుచరుడిగా ప్రచారంలో ఉన్న బండ మల్లేష్ అనే వ్యక్తి ప్రత్యర్థులు చేసిన విమర్శలకు ప్రతివిమర్శలు చేసే క్రమంలో నాయి బ్రాహ్మణ కులవృత్తి సామెతను ఉదాహరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వర్గానికి చెందిన పలువురు నాయకులతోపాటుగా, అనేకమంది సదర్ పోస్టు నాయి బ్రాహ్మణ కుల వృత్తిని కించపరిచే విధంగా ఉండదని విమర్శిస్తూ, 24 గంటల్లో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో చేసిన పొరపాటును గుర్తించిన బండ మల్లేష్ సదరు వ్యాఖ్యలతో నాయి బ్రాహ్మణ సోదరుల మనోభావాలు దెబ్బతీస్తే క్షమించాలి అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ప్రతి విమర్శ చేసిన పోస్టులో కూడా కించపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యలను తొలగించాడు. ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా పేరున్న వ్యక్తి ఓ కులాన్ని కించపరుస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారమే రేగింది.

Advertisement

Next Story