పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ సర్వే

by Sridhar Babu |
పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ సర్వే
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ యంత్రాంగం శ్రమించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. జిల్లాలోని భూముల సర్వే ను పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహించి, కేఎంఎల్ మ్యాప్ (గూగుల్) లో పొందుపరచాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో జిల్లాలోని భూముల సర్వే పై అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో క‌లిసి క‌లెక్ట‌ర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఖచ్చితమైన ప్రమాణాలతో జిల్లాలోని నిషేధిత భూములు, రక్షణ శాఖ, అటవీశాఖ, సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన‌ భూములను సర్వే చేయాలని కోరారు.

ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా సర్వే నిర్వహించిన, ఆ భూముల వివరాలను సాంకేతికంగా కిహోల్ మార్కప్ లాంగ్వేజ్ (KML) మ్యాప్ (గూగుల్) లో త్వరితగతిన పొందుపరచాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ లో భాగంగా లేఅవుట్ల రెగ్యులరైజేషన్ బిల్డింగ్ పర్మిషన్స్ టీజీ ఐపాస్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి కేఎంఎల్ మ్యాప్ లో సూచించ‌న భూముల వివరాల ప్ర‌కారం అనుమతులు ఇచ్చేందుకు సులభతరం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ భూముల వివరాలను మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో శాశ్వత రికార్డులుగా సిద్ధం చేసి భద్రపరచాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులకు సూచించారు. రక్షణ శాఖ, అటవీశాఖ భూములకు సంబంధించి సరిహద్దులను గుర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు, తహసీల్దారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story