- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత ఔట్.. TGO అధ్యక్షురాలిపై రేవంత్ సర్కార్ బదిలీ వేటు
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి జోన్ పరిధిలో సుధీర్ఘ కాలంగా పని చేస్తున్న జోనల్ కమిషర్మమతకు స్థాన చలనం లభించింది. కూకట్పల్లి జోనల్కమిషనర్మమతను నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్అర్బన్మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి విధేయురాలిగా పని చేస్తుందని, మాజీ మంత్రి అండతో తనకు కావలసిన చోట పోస్టింగ్ వేయించుకోవడం, గంటలో తనకు వచ్చిన బదిలీ ఆర్డర్‌ను సైతం వెనకకు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయిస్తూ సుధీర్ఘ కాలం కూకట్ పల్లి జోన్‌లోనే పాతుకు పోయినట్లు ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో జోనల్‌కమిషనర్ మమతకు వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన.. ఆమె పట్టించుకోక పోవడంతో రేవంత్‌రెడ్డి జోనల్కమిషనర్మమతపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి.
ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మమతపై వేటు పడుతుందని భావించగా.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకు జోనల్ కమిషనర్మమత టీజీఓ సంఘం తరఫున రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో మమత బదిలీ అంత త్వరగా ఉండక పోవచ్చని అందరు భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్‌లకు స్థాన చలనం కల్పించి మమతను నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్ అర్బన్మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ, ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్‌ను కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.