- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేశ్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయండి..
దిశ ప్రతినిధి, మేడ్చల్: కేశ్వాపూర్ రిజర్వాయిర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని మేడ్చల్ జడ్పీ ప్లోర్ లీడర్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం భూ నిర్వాసితులతో కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కేశ్వాపూర్ రిజర్వాయర్ కోసం రైతుల వద్ద నుంచి భూములు సేకరించి సంవత్సరాలు గడుస్తున్నా, రిజర్వాయర్ పనులను చేపట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించిన భూములను తిరిగి వారికే బేషరతుగా అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారులు తమ వద్ద పెట్టుకున్న రైతుల పట్టాదారు పాసు పుస్తకాలను తిరిగి ఇవ్వాలని, తక్షణమే ఆ భూములకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి చామకూర మల్లారెడ్డి రైతుల గోసను పట్టించుకోవాలని, మంత్రి రైతుల సమస్యలను పరిష్కరించకుంటే త్వరలోనే కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందని హెచ్చరించారు.
ఈ సమస్యను టీపీసీపీ చీఫ్ , స్థానిక పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హరివర్దన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సింహులు యాదవ్, వైఎస్ గౌడ్, భీమిడి జైపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ దోసకాయల వెంకటేష్, తుంకి బిక్షపతి, ఎంపీటీసీ కోడూరి అశోక్, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.