తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు జైలు శిక్ష

by Kalyani |
తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు జైలు శిక్ష
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి: తన మంగళసూత్రం దొంగలించారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు న్యాయస్థానం జైలు శిక్ష విధించిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కార్ఖాన సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మడ్ ఫోర్ట్ గుడిసెలో ఉప్పళ్ల చెన్నమ్మ కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి 1.10నిమిషాల ప్రాంతంలో స్థానికంగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు తనను కత్తితో బెదిరించి తన మెడలో ఉన్న 8 గ్రాముల పుస్తెలతాడును తెంపుకుని పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జరిగిన సంఘటనపై పోలీసులు విచారణలో చోరీ ఉత్త నాటకమని తేలింది. తప్పుడు కేసు నమోదు చేయించినందుకు ఆమెను పోలీసులు అదుపు లోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా సికింద్రాబాద్ లోని 11వ మెట్రో పాలిటన్ ప్రత్యేక కోర్టు ఆమెకు 5 రోజుల జైలు శిక్ష రూ. 200 జరిమానా విధించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed