IT Raids On TRS Minister Malla Reddy. రంగంలోకి 52 ఐటీ బృందాలు

by samatah |   ( Updated:2022-11-22 07:36:59.0  )
IT Raids On TRS Minister Malla Reddy. రంగంలోకి 52 ఐటీ బృందాలు
X

దిశ ప్రతినిధి,మేడ్చల్/ బోయిన్ పల్లి/దుండిగల్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి పై ఐటీ రైడ్ చేస్తుంది. మంగళవారం ఉదయం తెల్లవారు జాము 5 గంటల ప్రాంతంలో బోయిన పల్లి‌లోని మంత్రి నివాసం తోపాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కొంపల్లి లోని కుమారులు వేర్వేరుగా నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రా రెడ్డి నివాసల్లోను తనిఖీలు చేపడుతున్నాయి. అదేవిధంగా మంత్రి తమ్ములు నర్సింహ రెడ్డి, గోపాల్ రెడ్డి‌తో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ లతో పాటు అనుబంధ సంస్థలు,పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థలను సైతం టార్గెట్ చేస్తూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.




కేంద్ర బలగాల పహారలో..

మల్లారెడ్డి కి సంబంధం ఉన్న సంస్థలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏక కాలంలో 52 బృందాలు తనిఖీ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విలువైన పత్రాలు,ఆదాయం చెల్లించిన డాక్యుమెంట్స్, లాండ్స్ కాగితాలు స్వాధీనము చేసుకున్నట్లు తెలిసింది. కాగా

మీడియాను లోపలికి పోలీసులు అనుమంచడం లేదు. ఫోటోలు కూడ తీయొద్దని అంటున్న పో లీసులు. మల్లారెడ్డి ఇంట్లో నే ఉండి అధికారులకు సహకరిస్తున్నాడని సమాచారం. మంత్రి ని కలుద్దామని వచ్చిన వారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. బోయిన్ పల్లి‌లో ని సౌజన్య కాలనీ‌లో ని మంత్రి మల్లారెడ్డి అల్లుడు టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో కూడ సోదాలు నిర్వహిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..సాయంత్రం వరకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మంత్రి కుమారుల ఇళ్లలో..

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కోనసాగుతున్నాయి. కొంపల్లిలో పాలం మెడోస్‌లో ఆయన నివాసముండే 169 వ విల్లాలో ఉదయం 7 నుండి సోదాలు జరుగుతుండగా మహేందర్ రెడ్డి ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. మైసమ్మగూడ,మేడ్చెల్ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్న ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ సదరు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల పై దాడులు కక్ష్య సాధింపు చర్యలే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో దాడులు కక్ష్య సాధింపు చర్యే అని, కేంద్రంలో బీజేపీ అధికారం లో ఉంది, వాళ్ళకు పవర్ ఉంది అనుకుంటే పొరపాటే.. మేము కూడ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతాము.. ఇంతకు ముందే నాకు ఈ విషయం తెలిసింది. పూర్తి వివరాలు వచ్చాక మాట్లాడుతానన్నారు.

సోదరుడి ఇంట్లో లాకర్ కనుగొన్న ఐటీ అధికారులు

Advertisement

Next Story