- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IT Rides ఎపిసోడ్‌లో హైడ్రామా.. ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న మల్లారెడ్డి..!
దిశ ప్రతినిధి, మేడ్చల్/బోయిన్ పల్లి/దుండిగల్: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఐటీ రైడ్స్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. బుధవారం ఉదయం మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డికి చాతీలో నొప్పి రావడంతో ఐటీ అధికారులు చికిత్స నిమిత్తం సూరరాంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించిన విషయం విధితమే. అయితే మంత్రి ఐటి అధికారులతో వాగ్వివాదానికి దిగి, తన కుమారుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు పరుగులు తీశారు. హస్పటల్‌లో చికిత్స పొందుతున్న మహేందర్ రెడ్డిని పరామర్శించేందుకు ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్.రమణ, ఎమ్మెల్యే వివేకానందలు హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న అనంతరం కాసేపు మల్లారెడ్డితో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, రమణ, ఎమ్మెల్యే వివేక్‌లతో కలిసి మంత్రి ఒకే కారులో బయటకు వెళ్లారు.
తన కోడుకు, కోడలు రావాలి..
తన సొంత ఆసుపత్రిలో పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డికి వైద్యం చేసేందుకు ఇతర డాక్టర్లు వద్దని మంత్రి మల్లారెడ్డి వారించినట్లు తెలిసింది. తన చిన్న కుమారుడు డాక్టర్ భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డితోనే వైద్యం చేయించాలని పట్టుబట్టినట్లు తెలిసింది. మీరు పత్రాలు తీసుకువచ్చి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడుతానని, నా ఆస్తులు మీకు రాసి ఇవ్వమన్నా.. కేంద్రానికి రాసి ఇవ్వమన్నా రాసి ఇస్తానని ఐటీ అధికారులతో మంత్రి అన్నట్లు సమాచారం. పెద్ద కుమారుడు చికిత్స పొందుతున్న వార్డు వద్ద మంత్రి కన్నీంటి పర్యంతమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ భద్రారెడ్డి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నప్పటికీ, మంత్రి ఒత్తిడి మేరకు వారిని ఆసుపత్రికి తీసుకువచ్చి పెద్దకుమారుడికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. మహేందర్ రెడ్డిని పరిశీలించిన మంత్రి చిన్న కోడలు డాక్టర్ ప్రీతి మహేందర్ రెడ్డి హెల్త్ కండీషన్ స్టేబుల్‌గా ఉందని చెప్పారు. చెస్ట్, లెఫ్ట్ షోల్డర్‌లో నొప్పితో ఆయనను హాస్పిటల్‌కు తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలోనూ ఇలాంటి నొప్పి ఒకసారి వచ్చినట్లు స్పష్టం చేశారు.
ఆసుపత్రి వద్ద హైడ్రామా..
సూరారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. తన కుమారున్ని చూసేందుకు వెళ్లిన మంత్రి పరామర్శించిన అనంతరం నేరుగా తన ఇంటికి వెళ్లకుండా, తన సమీప (మరదలు కుమారుడు) బంధువు ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లాడు. కాసేపటి తర్వాత ప్రవీణ్ రెడ్డితోపాటు హాస్పిటల్‌కు తిరిగి వచ్చారు. ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడంతో వారి వెంట ఓ అధికారి కూడా హాస్పిటల్‌కు వచ్చినట్లు సమాచారం. హాస్పిటల్కు వచ్చినప్పుడు ప్రవీణ్ రెడ్డి చేతికి కట్టుతో కనిపించారు. కాగా మహేందర్ రెడ్డి ఆసుపత్రి పాలవ్వడంతో పరామర్శకు వెళ్లిన మంత్రి తన చిన్న కొడుకు, చిన్న కోడలు, బంధువు ప్రవీణ్ రెడ్డిని ఒకే చోటకు చేర్చడం గమనార్హం.
అల్లుడి నివాసంలో భారీ నోట్ల కట్టలు..
మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో భారీ నోట్ల కట్టలు బయట పడినట్లు తెలుస్తోంది. బోయిన్ పల్లిలోని మర్రి రాజశేఖర్ రెడ్డి నివాసం నుంచి నాలుగు కాటన్లలో రూ.500లు, రూ.2000 వేల నోట్ల కట్టలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున విలువైన డాక్యుమెంట్లను కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ నగదు అంతా రాజశేఖర్ రెడ్డి తన పర్సనల్ లాకర్‌లో భద్ర పరిచినట్లు సమాచారం.
రాజకీయ కుట్ర.. మంత్రి
రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తాము దొంగ దందాలు చేయడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనతోపాటు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. తన కోడుకును వేధించడంతోనే అస్పత్రి పాలయ్యాడని, ప్రస్తుతం మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ప్రవీణ్ రెడ్డికి కూడా ట్రీట్‌మెంట్ నడుస్తుందన్నారు. సోదాల పేరిట దౌర్జన్యం చేయడం మంచిది కాదన్నారు. కాగా ఉదయం నుంచి ఆసుపత్రి వద్దనే ఉన్న మంత్రి మధ్యాహ్నం తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారు.
Read more:
1.మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్.. హూటాహుటిన ఆసుపత్రికి తరలింపు