- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Hindu temples : దుర్గమ్మా.. గుడిదారి కష్టాలు తీర్చమ్మా..!
దిశ, జవహర్ నగర్ : దుర్గాదేవి ప్రధాన హిందూ దేవత. రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతిగా, పరాశక్తి, జ్ఞానప్రదాత పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి మాతగా ప్రజలు విశ్వసిస్తుంటారు. కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను, మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ దేవి పూజలందుకొంటోన్న దేవాలయం మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండల పరిధిలోని రాజ బొల్లారంలో ఉండడం విశేషం, కానీ అక్కడి ప్రజలు, భక్తులు మాత్రం దుర్గమ్మా.. గుడిదారి కష్టాలు తీర్చమ్మా..! సరస్వతమ్మా... అధికారులకు బుద్ధులు నేర్పమ్మా..!! అని వేడుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండల పరిధి, రాజ బొల్లారం తాండలోని శ్రీ లక్ష్మీ దుర్గా సరస్వతి దేవాలయానికి వెళ్ళాలంటే దారి కోసం కష్టాలు పడాల్సి వస్తుంది. అష్టదిక్కులు వెదుకుతూ వెళ్ళాల్సి వస్తోంది. ఎందుకంటారా...? వివరాల్లోకి వెళ్దాం...రాజ బొల్లారం తాండలోని శ్రీ లక్ష్మీ దుర్గా సరస్వతి దేవాలయానికి ముందు ఉన్న సర్వే నెంబర్ 26 లోని ఇనాం భూములను ఎన్నో ఏళ్ల క్రితం చాకలి మాన్యాల కింది చాకలి సత్తయ్య అప్పజెప్పారు. అప్పటి నుండి గుడి ముందున్న స్థలంలో దేవాలయ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో సంబంధిత అధికారులు దేవాలయం ముందున్న భూమిని క్రీడా ప్రాంగణంగా ఏర్పాటు చేశారు. దీంతో దేవాలయానికి వెళ్లాలంటే తీవ్ర ఆటంకాలు అంతరాయాలతో భక్తులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పండుగలు, ప్రత్యేక పూజలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నోచుకోవడం లేదు. భక్తులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్పించడంతోపాటు దేవాలయ అభివృద్ధికి అడ్డంకిగా అధికారులు క్రీడా ప్రాంగణ కంచె ను ఏర్పాటు చేశారని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం విద్యాబుద్ధులు ప్రసాదించేందుకు దుర్గాదేవి సరస్వతి దేవి అనుగ్రహం కోసం నిత్యం భక్తులు వస్తుంటారని, వారందరికీ దేవాలయానికి రావడానికి దారులు లేక, ఎటు చూసినా ప్రాంగణంగా టెంపర్వరి కాంపౌండ్ ను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక ప్రజలు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దేవాలయానికి దారిని ఏర్పాటు చేస్తూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం స్థలాన్ని కేటాయించాలని పలువురు భక్తులు, స్థానికులు వేడుకుంటున్నారు.
హిందూ దేవాలయాల పై కక్ష సాధింపు తగదు.. విశ్వహిందూ పరిషత్ పరిషరామ సేవా సమితి ఆధ్యాత్మిక సేవా వాహిని
ఎన్నో ఏళ్లుగా భక్తులు దేవాలయాన్ని సందర్శించి, అమ్మవారి సేవలు పొందుతూ ఆధ్యాత్మిక చింతలో హిందూ భక్తులు తరలివస్తున్న దేవాలయానికి దారి లేకుండా దేవాలయ భూములను అడ్డగోలుగా ఆట ప్రాంగణంగా ఏర్పాటు చేయడం తగదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు జపించేసుకొని ఆలయానికి దారి కేటాయిస్తూ ఆధ్యాత్మిక సేవలకు స్థలాన్ని కేటాయించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ పరిషరామ సేవా సమితి ఆధ్యాత్మిక సేవా వాహిని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో శ్రీ రామానుజ యాగ్రీక పీఠం అధ్యక్షులు గోవర్ధనం ప్రవీణ్ కుమార్ ఆచార్య, దక్షిణ భారతదేశ సహాయ కార్యదర్శి తిరుమల మనోహరాచార్య, బ్రాహ్మణ పరిషత్ సభ్యులు గడియారం మురళీధర్ శర్మ, గడియారం పవన్ కుమార్ శర్మ, బొమ్మగంటి అరుణ్ కుమార్ శర్మ, ప్రదీప్ శర్మ, సాయి శర్మ తదితరులు ఉన్నారు.