సున్నం చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్​ రంగనాథ్

by Sridhar Babu |
సున్నం చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్​ రంగనాథ్
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి మండల పరిధిలోని సున్నం చెరువును హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​ శనివారం సందర్శించారు. హైడ్రా కమిషనర్​తో పాటు జీహెచ్​ఎంసీ, రెవెన్యు, ఇరిగేషన్​ అధికారులు పాల్గొన్నారు. సున్నం చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లో ఆక్రమణలు, హద్దులకు సంబంధించిన వివరాలను కమిషనర్​ రంగనాథ్​ అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా సున్నం చెరువు కూకట్​పల్లి, శేరిలింగంపల్లి రెండు మండలాల పరిధిలోకి వస్తుంది.

కూకట్​పల్లి మండల పరిధిలో సున్నం చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ పరిధిలో పద్మావతినగర్​ వైపు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించిన 80 ఇండ్లకు, శేరిలింగంపల్లి మండలం పరిధిలో ఆక్రమణలను గుర్తించిన 30 ఇండ్లకు రెండు మండలాల రెవెన్యు, ఇరిగేషన్​ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు జారీ చేస్తున్న క్రమంలో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సున్నం చెరువును సందర్శించడంతో ఏం జరుగుతుందో అన్న చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో మూసాపేట్​ డీసీ రమేష్​, ఏసీపీ మల్లేశ్వర్​, టీపీఎస్​ మహేందర్​, ఇరిగేషన్​ ఏఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story