- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్గత పోరు - మారని తీరు..!
దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వజ్రష్ యాదవ్ ని మేడ్చల్ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. దీంతో పార్టీలో ముందు నుంచి ఉన్న అంతర్గత పోరు మరింత పెరిగింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చొరవతో చేతులు కలిపిన నేతలు మళ్లీ మొదటికొచ్చారు. శుక్రవారం మండలంలోని శ్రీనివాస కళ్యాణం మండపంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, ఉద్దేశపూర్వంగానే హరివర్ధన్ రెడ్డి ఈ సమావేశానికి దూరం ఉన్నారని పార్టీలో కొందరు నాయకులు అనుకుంటున్నారు. తన అనుచరులను వెంట బెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా స్థాయిలో కీలక పదవినిచ్చి సర్దుబాటు చేయాలని హరివర్ధన్ రెడ్డి అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా మొహం చాటేస్తున్నారని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం హరివర్ధన్ రెడ్డి మూడుచింతలపల్లి జెడ్పీటీసీగా ఉన్నారు. పార్టీలో ముఖ్యనేతల మధ్య ఐక్యత లేకుండా ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటమి తప్పదని విశ్లేషకులు అంటున్నారు.