భారత్ విశ్వగురు దిశగా పయనిస్తోంది.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

by Javid Pasha |   ( Updated:2023-01-28 14:49:42.0  )
భారత్ విశ్వగురు దిశగా పయనిస్తోంది.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య
X

దిశ, కుత్బుల్లాపూర్: భారత్ విశ్వగురు దిశగా పయనిస్తోందని, ప్రతిభ గల యువతతోనే అది సాధ్యమని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని బాచుపల్లి వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి పాఠశాలలో 27వ వార్షికోత్సవ వేడుకలు శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం, ఎన్సీసి క్యాడెట్ లు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇతర అతిథులుగా ఇండియన్ ఆర్మీ నుండి కల్నల్ రంజిత్ చాకో, 7(టీ) గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, స్కూల్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వల్లూరిపల్లి రాజా రామమోహనరావు, కార్య నిర్వాహక ధర్మకర్తలు వల్లూరిపల్లి రాజశేఖర్, వల్లూరిపల్లి రాజ్ కుమార్, స్కూల్ డైరెక్టర్ కొడాలి విజయ రాణి పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఎం.వెంకటయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించారు.

అనంతరం సంవత్స పొడవునా జరిగిన ఈవెంట్లు, విజయాలు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. విద్యా, క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిధుల నుండి బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం.వెంకయ్య నాయుడు అందించిన విజ్ఞతతో కూడిన మాటలు హాజరైన ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. విద్యార్థులకు సందేశాత్మక సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన నాట్య సంస్కృతి, భువన విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాస్టర్ విజయ్, నవ్య, బిందు గూడూరు ఈ ఆహ్లాదకరమైన సాయంత్రానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed