- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్దం చేయాలి
దిశ, మేడ్చల్ బ్యూరో : వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్దం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ కలెక్టరేట్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, రాధికా గుప్తా, రాచకొండ డీసీపీ కరుణాకర్, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియలతో కలిసి జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో మొత్తం 17 చెరువులు ఉన్నాయని, వాటిలో వినాయక నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లును పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని అందుకు అవసరమైన రూట్లలో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణా శాఖ అధికారులు సర్టిఫై చేయాలని సూచించారు. ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
చెరువుల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్లతో ఇద్దరు మెడికల్ అఫీసర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఎమర్జెన్సీ సందర్భంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఉచితంగా ఫస్ట్ ఎయిడ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రదేశాలలో గతంలో కంటే అధిక సంఖ్యలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేయాలని కోరారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు ట్రాన్సఫార్మర్లు, పవర్ జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగల సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి సూచించారు. చెరువుల వద్ద పొల్యూషన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉండాలన్నారు. గణేష్ నవరాత్రులు మొదలు కొని నిమజ్జనం పూర్తయే వరకు అగ్ని మాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నిమజ్జన చెరువులకు ఒక నోడల్ ఆఫీసర్ తో పాటు సంబంధిత శాఖల సిబ్బందితో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. శామీర్ పేట చెరువు దగ్గర అవసరమైన మోబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.