బ్రేకింగ్ న్యూస్.. ఈటల ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్

by Disha Desk |
బ్రేకింగ్ న్యూస్.. ఈటల ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం జనగామలో టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై చేసిన దాడిలో గాయపడినవారిని పరామర్శించడానికి వెళ్ళడానికి వీలు లేదంటూ ఈటలను గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయమే శామీర్ పేట, పూడురులో ఈటల రాజేందర్ నివాసం ముందు పోలీసులు భారీగా మొహరించారు. ఈటలను ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. తెల్లవారు జాము నుంచే పోలీసులు ఈటల నివాసం వద్ద చలి మంటలు వేసుకొని పహారా కాస్తున్నారు.

ఈటల ఆగ్రహం

ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని ఈటల అన్నారు. కానీ ధర్నాలు చేయడానికి, నిరసనలు చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ వారికి మాత్రమే అనుమతులు ఉంటాయా? అని ప్రశ్నించారు. దాడులు జరిగితే పోలీసులు వారి పక్షాన నిలువడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జులం ఎక్కువ కాలం చెల్లదని ఈటల స్పష్టం చేశారు.

Advertisement

Next Story