- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్లకు అడ్డంగా మండపాలు పెట్టొద్దుః ఏసీపీ శ్రీనివాస్ రావు
దిశ, కూకట్పల్లి: వినాయక మండపాలను రోడ్లకు అడ్డంగా పెట్టొద్దని ఏసీపీ శ్రినివాస్ రావు అన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక మండప నిర్వాహకులతో సోమవారం కూకట్‌పల్లిలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక మండపాలు నిర్వహిస్తున్న వారికి ఏసీపీ పలు సూచనలు ఇచ్చారు. మండపాలు ఏర్పాటు చేసే వారు తప్పకుండా పోలీసు శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలను పెట్టుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎటువంటి చర్యలకు పాల్పడితే పోలీసు శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనానికి సంబంధించి ఐడిఎల్ చెరువు కట్టపై అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని, పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి భక్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సిఐ కొత్తపల్లి ముత్తు, ట్రాఫిక్ సిఐలు ముత్తు, వెంకట్, కూకట్పల్లి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.