Peerjadiguda : పీర్జాదిగూడ కార్పొరేషన్ లో అవిశ్వాసం..

by Kalyani |   ( Updated:2024-07-25 13:18:34.0  )
Peerjadiguda : పీర్జాదిగూడ కార్పొరేషన్ లో అవిశ్వాసం..
X

దిశ, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాసానికి కలెక్టర్ గౌతమ్ ఆగస్టు 9 నాడు అవిశ్వాసానికి డేట్ ను ఖరారు చేశారు. కాంగ్రెస్ ఖాతాలోకి మరో పెద్ద కార్పొరేషన్ చేరనున్నట్లు సమాచారం. దీంతో గత కొన్ని నెలలుగా పీర్జాదిగూడలో దోబూచులాడుతున్న అవిశ్వాసానికి వచ్చే నెల వేదికకానుంది. ఎత్తుకు పై ఎత్తులతో రసవత్తరంగా ఎన్నో ఒడిదోడుకుల మధ్య కార్పొరేషన్ లో మేయర్ పీఠం కాంగ్రెస్ వశం కానుందా?. ప్రస్తుతం కాంగ్రెస్ కార్పొరేటర్లు టూర్ లో ఉన్నారు. ఆగస్టు 9 నాడే డైరెక్ట్ గా కార్యాలయానికి చేరుకొనున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో కాంగ్రెస్ ఖాతాలోకి మరో కార్పొరేషన్ చేరానుంది. ఇప్పుడు మేయర్ గా అమర్ సింగ్ కు అన్ని మార్గాలు అనుకూలంగా ఉన్నట్టే అని నాయకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed