- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్....అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ
దిశ,కంటోన్మెంట్ : రక్షణ శాఖ లీజు స్థలాల్లో అక్రమ దందాపై కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం చర్యలకు సిద్దమైంది. రక్షణ శాఖ స్థలాల్లో అక్రమ దందాపై 'దిశ' దినపత్రికలో వస్తున్న వరుస కథనాలతో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఇంజనీరింగ్ విభాగంపై సీరియస్ అయినట్లు సమాచారం. నందమూరినగర్ లోని బీ 3 ఓల్డ్ గ్రాంట్స్ 181 బంగళాలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏమి చేస్తున్నారని, తక్షణమే నివేదిక సమర్పించాలని అదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అదేవిధంగా అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ , తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఇంజనీరింగ్ విభాగం ఏఈ క్రిష్ణసాగర్ ఘటన స్థలాన్ని సందర్శించి నోటీసులు అందజేసినట్లు తెలిసింది. అక్రమ నిర్మాణదారులు సైతం గేట్లకు తాళాలువేసి, షెడ్ల నిర్మాణ పనులను నిలిపివేయడం గమనార్హం. ఈ విషయమై సీఈఓ మధుకర్ నాయక్ ను 'దిశ' సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరని సమాధానం వస్తుంది. కాగా లీజు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, ట్రేడ్ లైసెన్స్ బాగోతాలను బయటపెట్టి, వరుస కథనాలు ప్రచురించిన దిశను కంటోన్మెంట్ వాసులు అభినందించారు.
- Tags
- Mechal
- Telugunews