యువకుడి అదృశ్యం..

by Kalyani |
యువకుడి అదృశ్యం..
X

దిశ, మేడిపల్లి: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో నివాసం ఉంటున్న కలిమికొరు రంజిత్ రెడ్డి(26), మాదాపూర్ లో ప్రైవేట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో డ్యూటీకి అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో రంజిత్ రెడ్డి తల్లి అంజలి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story