అక్రమ నిర్మాణాల కూల్చివేత..

by Kalyani |
అక్రమ నిర్మాణాల కూల్చివేత..
X

దిశ, కుత్బుల్లాపూర్: గాజులరామారంలో రెవిన్యూ అధికారులు పలు ప్రభుత్వ సర్వే నెంబర్లలో, చెరువులలో స్థలాలు ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంజీవ రావు ఆదేశాల మేరకు ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.

సర్వే నెంబర్ 307 లో..

గాజులరామారం సర్వే నెంబర్ 307లో గల ప్రభుత్వ భూమిలో అక్రమ రూంల నిర్మాణాలు, భారీ ప్రహరీ నిర్మాణాన్ని రెవిన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. తప్పుడు పత్రాలు చూపుతూ ఓ మాజీ విలేకరి 307 లోని ప్రభుత్వ భూమిని సుమారు రెండు ఎకరాలు కబ్జా చేశాడు. చుట్టూ ప్రహరీ నిర్మించి అక్రమంగా రూంలు సైతం నిర్మించాడు. ఫిర్యాదు అందుకున్న రెవిన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడులు చేసి అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు.

బంధం చెరువు ఎఫ్టీఎల్ లో..

గాజులరామారం బంధం చెరువు ఎఫ్టీఎల్ లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పాగా వేసింది. అధికార వ్యవస్థలను మోసం చేస్తూ, తప్పుడు సరిహద్దులు నమోదు చేస్తూ ఇరిగేషన్ స్థలాలలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. ఫిర్యాదు అందుకున్న కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంజీవరావు తన రెవిన్యూ టీంను బంధం చెరువు వద్దకు పంపి అక్రమంగా వెలసిన నిర్మాణాలు తొలగించారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ స్థలాలు ఆక్రమిస్తే ఊరుకోమని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కబ్జా దారులను తహసీల్దార్ హెచ్చరించారు. అలాగే సర్వే నెంబర్ 342 లో అక్రమంగా వెలసిన గుడిసెలను, గదులను రెవిన్యూ సిబ్బంది కూల్చేశారు.

Advertisement

Next Story

Most Viewed