- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూసారానికి అనుగుణంగా పంటలు వేయాలి
దిశ, శామీర్ పేట : భూసారానికి అనుగుణంగా పంటను వేయాలని, తద్వారా అధిక దిగుబడిని పొందవచ్చని ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ పుష్పజిత్ చౌదరి అన్నారు. లారస్ ల్యాబ్స్, ఇక్రిశాట్ (పటాన్చెరు) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలోని రైతుల పొలాల్లో భూసార పరీక్ష నిర్వహించి గురువారం ఫలితాలను రికార్డు రూపంలో రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. సాంకేతికతను వినియోగించుకొని భూసారానికి అనుగుణంగా ఎరువులను ఉపయోగించాలని వివరించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ రంగనాథ్, ఏడీఏ వెంకటరామిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవి, చేతన, లక్ష్మారెడ్డి, లావణ్య, పోచమ్మ, మహేందర్, నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శిల్పా యాదగిరి, రైతులు పాల్గొన్నారు.
- Tags
- Soil tests