ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు.. తెరవెనక పెద్దల సహకారం..?

by srinivas |
ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు.. తెరవెనక పెద్దల సహకారం..?
X

దిశ, దుండిగల్: అధికారుల అండ ఉంటే అక్రమమైనా సక్రమం అవుతుంది. ప్రభుత్వ భూమైనా, నిషేధిత జాబితాలో ఉన్నా పర్వాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు దుండిగల్ మున్సిపాలిటీ బహదూరపల్లిలోని ప్రభుత్వ భూమిలో సీసీ రోడ్డు నిర్మాణమే నిదర్శనంగా నిలుస్తుంది. దీన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దుండిగల్ మున్సిపాలిటీ బహదూరపల్లిలోని 227 సర్వే నంబర్‌లో 353.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 2009లో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అప్పటి గ్రామ సర్పంచ్ సుజాత శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. పరిశీలించి జస్టిస్ ఆర్.సుభాశ్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం డబ్ల్యూపీ నంబర్ 27214/2009, ఇన్‌డబ్ల్యూపి నంబర్ 20907/2009 ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చాలంటూ ఆదేశాలిచ్చింది.

అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రావు ఐపీఎస్ కోర్ట్ డైరెక్షన్ తో విచారణ జరిపి ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అది ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉంది. ప్రభుత్వ భూమిలో సీసీ రోడ్డుకు 60లక్షల పంచాయతీ రాజ్ నిధులు మంజూరు చేసి నిర్మించారు. ఈ రోడ్డును ఈ నెల 26న స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమార్కులకు సహకరిస్తుండడంతో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సర్కారు భూమిలో సిసి రోడ్డు నిర్మాణం

బహదూరపల్లి సర్వే నంబర్ 227లోని ప్రభుత్వ భూమిలో 60 లక్ష్యల పంచాయితీ రాజ్ నిధులు వెచ్చించి సిసి రోడ్డు నిర్మాణం చేయడం పలు విమర్శలకు తావిస్తుంది, కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దల సహకారంతోనే అక్రమార్కులు బరితెగిస్తున్నారు, సిసి రోడ్డు నిర్మాణానికి జిల్లా ఉన్నతాధికారితోపాటు, స్థానిక ప్రతినిధి అండ ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల చేతివాటంతోనే ప్రభుత్వ భూమిలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్యెల్యే రిబ్బన్ కటింగ్

హైకోర్ట్ ఆదేశాలతో 2009లో పరిశీలించిన అప్పటి జాయింట్ కలెక్టర్ జగన్మోహన్‌రావు ఐపీఎస్ విచారణ జరిపి ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు, బహదూరపల్లి సర్వే నంబర్ 227‌లోని ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్ తోపాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టారాదు, నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిలో సిసి రోడ్డు నిర్మాణం జరగడం స్థానిక శాసన సభ్యులు ఏకంగా నిర్మాణానికి రిబ్బన్ కటింగ్ చేయడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed