- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Collector : రైతు రుణమాఫీ పక్కాగా అమలు : కలెక్టర్ గౌతమ్
దిశ,మేడ్చల్ బ్యూరో : అర్హులైన రైతులకు రుణమాఫీ పథకం అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బ్యాంకులు, సహకార సొసైటీ బ్యాంక్ అధికారులు రుణమాఫీ అమలుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.గురువారం విసి మీటింగ్ హాల్ నుండి వ్యవసాయ, బ్యాంక్ అధికారులు, డి సి సి బ్యాంక్ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బ్యాంక్ అధికారులతో కలసి రైతు రుణమాఫీ పథకం కార్యక్రమం పై తీసుకోవాల్సిన చర్యల పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ... జిల్లాలో 2018 డిసెంబర్ 12 తేదీన తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన పంట రుణాలకు, 2023,డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
మొదటి విడుతలో 2,667 మంది రైతులకు జిల్లా లో మొదటి విడతలో 2,667 మంది రైతు కుటుంబాలకు 12 కోట్ల 53 లక్షలు రుణమాఫీ పథకం అందజేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. క్రాఫ్ట్ లోన్ కు అర్హులైన వారికి మొదటి విడత లో లక్ష రూపాయలు రైతు ఖాతాలో రెన్యువల్ చేయాలని సూచించారు. రెండవ విడత 1లక్షా, 50 వేల వరకు, మూడో విడత రెండు లక్షల వరకు దశలవారీగా రుణమాఫీ జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీ పథకం పై రైతులకు సందేహాలు ఏమైనా ఉంటే జిల్లాలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ( గ్రీవెన్స్ సెల్) నివృత్తి చేసుకోవలన్నారు. వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
మొదటి విడత లో రెన్యువల్ కాని వారు రెండవ, మూడవ విడతలలో రెన్యువల్ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రాఫ్ట్ లోన్ రెన్యువల్ విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా చూడాలని బ్యాంక్ అధికారులకు ఆదేశించారు. బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలన్నారు. రుణమాఫీ కోసం వచ్చే రైతులకు పూర్తిగా సహకరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రేఖ మేరీ, ఎల్ డి ఎం శ్రీనివాసులు, బ్యాంక్ మేనేజర్ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.