- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మార్వో పేరిట డబ్బులు వసూలు.. కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు
దిశ, మేడ్చల్ టౌన్: తాసిల్దార్ పేరు చెప్పి ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం పూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామంలో ఉన్న గంగస్థాన్ వెంచర్‌కి చెందిన బి ఎల్ రెడ్డి వద్ద కు వెళ్లి తాను ఎమ్మార్వో కార్యాలయం నుండి వచ్చానని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బిఎల్ రెడ్డి రెండు లక్షల రూపాయల చెక్కును మహేందర్ రెడ్డికి ఇచ్చాడు. 2 లక్ష రూపాయలు తీసుకున్న మహేందర్ రెడ్డి మళ్లీ వెంచర్ దగ్గరకు పెద్ద పెద్ద అధికారులకు మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే వెంచర్ పనులు ఆపివేయాలని చెప్పారు. దీంతో బిఎల్ రెడ్డి మేడ్చల్ తాసిల్దార్ శైలజకు జరిగిన విషయాన్ని సమాచారం అందించాడు. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తాసిల్దార్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడని మేడ్చల్ పోలీసులకు మేడ్చల్ ఎమ్మార్వో శైలజ ఫిర్యాదు చేసింది. మేడ్చల్ ఎమ్మార్వో శైలజ ఫిర్యాదు మేరకు ఐపీసీ 420,419,170 సెక్షన్ల కింద మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.