- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టేలా సీఎం ప్రయత్నం
దిశ, మేడ్చల్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంగళవారం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి పరిశీలించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ తో మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ వీరికి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని, వారు ఎక్కడికి వెళ్లినా పెద్దఎత్తున జనం వస్తారు కాబట్టి ముందస్తు ఏర్పాట్లు అవసరమన్నారు. సినిమా విడుదల అయినప్పుడు వేల మంది వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం అంటున్నారని, కానీ పోలీసులు తాము అనుమతి ఇవ్వలేదని అంటున్నారని పేర్కొన్నారు.
ఎవరి నిర్లక్ష్యమో కానీ ఓ నిండు ప్రాణం పోవడం బాధాకరం అన్నారు. వారి బాబు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలని హీరో అల్లు అర్జున్ ను కోరారు. బాబు వైద్య ఖర్చులు కూడా వారే భరించాలని, ఈ సంఘటన అందరికీ గుణపాఠం కావాలని సూచించారు. క్రికెట్, పొలిటికల్, సినిమా స్టార్స్ బాధ్యతాయుతంగా ఉండాలని హితువు పలికారు. కాగా దీనిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ పెద్దలు మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నట్టు ఉందన్నారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో, తెలియదన్నారు. కావాలని వారిని పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టుడు మంచిది కాదన్నారు. ప్రధానమంత్రి మా నియోజకవర్గానికి వచ్చారని, రోడ్ షో చూడడానికి ఒక పాత బిల్డింగ్ మీద చాలా మంది ఎక్కారని, ఇల్లు కూలి ఏమన్నా అవుతుందా అని భయపడ్డామని, ఏమన్నా అయితే ప్రధాన మంత్రిని బాధ్యులను చేస్తారా ? అని ప్రశ్నించారు.
కుంభమేళాలో కూడా తొక్కిలాటలు జరుగుతాయని గుర్తు చేశారు. ప్రభుత్వాలకు రెండు విశేష అధికారాలు ఉంటాయని, ఎవరినైనా ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు, ఎవరి మీద నైనా పన్నులు వేయవచ్చు అన్నారు. అంతమాత్రాన ఏది పడితే అది చేస్తామంటే ప్రజలు సహించరు అన్నారు. నేను ఇక్కడికి వచ్చింది శ్రీతేజ త్వరగా కోలుకోవాలని, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి అని పేర్కొన్నారు. దీన్ని రాద్ధాంతం చేస్తుంది బీజేపీ కాదని, కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనపై గంటలకొద్దీ అసెంబ్లీలో చర్చ పెట్టింది వారని, మొత్తం ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని రాజకీయపరంగా కాకుండా, చిల్లర వేషాలు వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.