- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mayor Jakkavenkat Reddy : మహిళలందరికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..
దిశ, మేడిపల్లి : మహిళలందరికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మను దహనానికి భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ.. జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తనస్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం వ్యాఖ్యలు కేవలం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల గురించి కాదని, తెలంగాణ మహిళలందర్నీ ఆయన అవమానించారని, మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిన్నచూపు ఇప్పుడు అందరికీ అర్థమైందని తెలంగాణలోని మహిళలందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, మధుసూధన్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, యూత్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బాలరాజు, యాసారం శ్రీనివాస్, జగన్ రెడ్డి, జోగి రెడ్డి, కిరణ్, కైసర్, మల్ల వెంకటేష్ గౌడ్, శ్యామల నర్సింహా, శంకర్ రావు, కళ్యాణి, ఇందిరా, మల్లిక, పుష్ప, తదితరులు పాల్గొన్నారు.