- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పెషల్ డ్రైవ్‌లో 100 వాహనాలకు చలాన్‌లు..
దిశ,ఉప్పల్: ఉప్పల్ రింగ్ రోడ్డు లో డీసీపీ మనోహర్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి తో కలిసి వాహనాలు విస్తృత తనిఖీలు నిర్వహించారు.నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు,నెంబర్ ప్లేట్లను మార్ఫింగ్ చేసిన వాహనాలు,సగం నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను ఆపి చలాన్లు వేసి ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ రావు,ఉప్పల్ ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ లక్ష్మి మాధవి మాట్లాడుతూ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద జరుగుతున్న తనిఖీలలో నెంబర్ ప్లేట్ సరిగా లేనటువంటి సుమారు 93 ద్విచక్ర వాహనాలను, ఐదు కార్లను,రెండు ఆటో లను పట్టుకొని చలాన్లు వేసినట్లు తెలిపారు.
వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు వారి నెంబర్ ప్లేట్లు సరిగా ఉండాలని, ఇన్సూరెన్స్, లైసెన్స్ తప్పక కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని సూచించారు.నెంబర్ ప్లేట్ మార్పిడి చేసి నడిపిస్తున్న టువంటి వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని ఏసీపీ శ్రీనివాస్ రావు,సీఐ లక్ష్మి మాధవి తెలిపారు.ఈ తనిఖీల్లో ఉప్పల్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బాల నరేష్, ఏఎస్ఐలు సాయన్న,భారతి ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.