- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమంగా బ్లాస్టింగ్.. ఇద్దరి పై కేసు నమోదు..
by Sumithra |
X
దిశ, మేడ్చల్ టౌన్ : అక్రమంగా బ్లాస్టింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు పై కేసు నమోదు చేసిన ఘటన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై పరశురాం తెలిపిన వివరాలు ప్రకారం షామీర్పేట్ మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఐవివై లీగ్ అకాడమీ బ్లాస్టింగ్ కి పాల్పడుతున్నారని పక్కా సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారన్నారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జుబ్బాపూర్ గ్రామానికి చెందిన పల్లపు కనకయ్య (36) ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలం నుంచి డిటోనెటర్లు, జలటిన్ కర్రలు, జెలటిన్ స్టిక్, బ్లాస్టింగ్ కంప్రెసర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. కనకయ్యతో పాటు స్థల యజమాని కొంపల్లి చెందిన విజయవర్ధన్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాం తెలిపారు.
Advertisement
Next Story