డ్రగ్స్ పార్టీలకు కేరాఫ్.. రాడిసన్ హోటల్ రూమ్ నెం.1200.. అబ్బాస్ వాంగ్మూలం‌లో ఆసక్తికర విషయాలు

by Shiva |   ( Updated:2024-02-29 04:59:53.0  )
డ్రగ్స్ పార్టీలకు కేరాఫ్.. రాడిసన్ హోటల్ రూమ్ నెం.1200.. అబ్బాస్ వాంగ్మూలం‌లో ఆసక్తికర విషయాలు
X

దిశ, రాచకొండ: రాడిసన్ హోటల్‌లోని రూమ్ నెం.1200‌లో డ్రగ్స్ పార్టీ‌కి సంబంధించి మొత్తం చాటింగ్ వాట్సాప్‌లో జరిగిందని గచ్చిబౌలి పోలీసు‌లు కోర్టుకు వివరించారు. సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ వాంగ్మూలం‌తో రాడిసన్ హోటల్ యజమాని కుమారుడు వివేకానంద ఈ నెల 24న మధ్యాహ్నం నుంచి తన స్నేహితులు రఘు చరణ్, సందీప్, శ్వేత, లిషి, నీల్, నిర్భయ్, క్రిష్, సలగంశెట్టి‌తో కలిసి అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీ నిర్వహించాడని తేలింది. పార్టీలో 3 గ్రాముల కోకైన్‌ను వారు తీసుకున్నట్లుగా నిందుతుడు సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ ఇచ్చిన వాంగ్మూలం‌లో బట్టబయలు అయినట్లు పోలీసులు కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించి ఫోన్‌పే లావాదేవీలను సేకరించనట్లుగా పోలీసులు వెల్లడించారు. అబ్బాస్ గ్రాము కోకైన్‌ను మిరజా వాహేద్ నుంచి కొనుగోలు చేశాడని, అందుకు గ్రాము కొకైన్‌కు రూ.14 వేలు వివేకానంద తన డ్రైవర్ ప్రవీణ్ ద్వారా చెల్లించినట్లుగా అబ్బాస్ తెలిపాడు. వివేకానంద గతేడాది నంచి మద్యం సేవిస్తున్నాడని, కోకైన్ పార్టీలను నిర్వహిస్తున్నాడని కూడా పేర్కొన్నాడు.

టెక్నికల్ ఎవిడెన్స్ ఇలా..

వివేకానంద -9966662111, సయ్యద్ అబ్బాస్ - 8886090110, నిర్భయ్ - 8978125343, సలాగేమ శెట్టి -8999888888, 9849123456, ప్రవీణ్ -9121785811, 9441100029 ఫోన్ నెంబర్లు గల వారు కోకైన్ తీసుకోవడంతో వాటి కోసం జరిగిన ఆర్థిక లావాదేవీలకు ఎవిడెన్స్‌గా పోలీసులకు చిక్కాయి. ఈ ఫోన్ నెంబర్లతో మిగతా అనుమానితులు, నిందుతుల ఫోన్ నెంబర్ల లొకేషన్స్ ఆధారంగా వారంతా ఈ నెల 24న డ్రగ్స్ పార్టీ‌లో ఉన్నట్లుగా ఆధారాలను కోర్టు ముందు నిరూపించే అవకాశం ఉంది. ఇలా ప్రతి ఒక్కరి వాంగ్మూలంతో కొత్త ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులకు అర్ధ‌రాత్రి 12 గంటలకు సమాచారం అందగా పోలీసు‌లు 12.40 నిమిషాలకు రాడి‌సన్ హోటల్‌కు చేరుకున్నారు. అయితే, కోకైన్ పార్టీ నుంచి అందరూ 12.30 వెళ్లిపోయారని పోలీసులకు అబ్బాస్ తన వాంగ్మూలంలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed