- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా దారుణ హత్య..?
దిశ, మేడ్చల్ టౌన్: అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబిల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలు ఒడిశా రాష్ట్రానికి చెందిన ధరిత్రిగా గుర్తించారు. మహిళా మెడకు తువాల, చేతులు తాడుతో కట్టేసి ఉన్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషా రాష్ట్రానికి చెందిన ధరిత్రి సింగ్ మేడ్చల్ విల్లో స్ప్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తుంది.
అక్కడే మేనేజర్ గా పనిచేస్తున్న చాన్ అనే వ్యక్తితో పరిచయమైంది. పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారడంతో ధరిత్రి సింగ్ గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని చాన్ ను బలవంతం చేసింది. గతంలోని చాన్ కు పెళ్లవడంతో పెళ్లికి నిరాకరించాడు. కాగా చాన్ అతని భార్య, కుటుంబ సభ్యులు పథకం ప్రకారం ధరిత్రిని హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సెక్షన్ ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.