- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జీహెచ్ఎంసీ చెత్త ఆటో చక్రాల కిందపడి బాలుడి దుర్మరణం..
దిశ, మల్కాజిగిరి: చెత్త సేకరించే ఆటో ట్రాలీ చక్రాల కింద పడి ఓ బాలుడు దుర్మరణం చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సోమవారం మధ్యాహ్నం సమయంలో మౌలాలీ ఆర్టీసీ కాలనీలో చెత్తసేకరించే ఆటో వచ్చింది. అదే సమయంలో మహమ్మద్ రజక్ అహ్మద్ ఖాద్రీ 16 నెలల బాలుడు రోడ్డుపైనే ఆడుకుంటున్నాడు. ఆటో శబ్ధానికి ఇంట్లోకి వెళ్తుండగా చెత్త ఆటో రివర్స్ తీసుకుంటుండగా ఆటోచక్రాల కిందపడి బాలుడు అపస్మారక స్థితికి వెళ్లాడు.
వెంటనే బాలుడి కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించడం వైద్యులు పరీక్షించి అప్పడికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే తన కుమారుడి మృతికి ఆటోడ్రైవర్ నిర్లక్ష్యమేనంటూ బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో బాలుడు ఆటో చక్రాల కిందపడిన చిత్రాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.