గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Kalyani |
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, ఉప్పల్: ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ ఎక్స్ రోడ్ కబ్రస్తాన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆకస్మాత్తుగా కింద పడుకొని ఉన్న వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఉప్పల్ లో బ్లూ క్లాట్స్ డ్యూటీ నిర్వహిస్తున్న శ్రీను సంఘటన స్థలానికి చేరుకొని చూడగా సుమారు 56 సంవత్సరాల వయస్సు గల బిచ్చగాడు బ్లాక్ కలర్ టీ-షర్టులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన వైద్యుడు వ్యక్తి మృతి చెందినట్లు ప్రకటించాడు. పీఎంఈ పరీక్షల నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మైబెల్లి తెలిపారు.

Advertisement

Next Story