- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నేతలు ఆందోళన... అరెస్ట్ చేసిన పోలీసులు
దిశ, జవహర్ నగర్: కొందరి స్వప్రయోజనాల కోసం కాకుండా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారిని వంద ఫీట్ల వెడల్పుతో చేపట్టాలని కార్పొరేషన్ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు శనివారం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ నేత ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డు రహదారిని 100 ఫీట్ల వెడల్పు చేయాలన్న డిమాండ్ తో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలోని ఫైరింగ్ రేంజ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సుమారు రెండు కిలోమీటర్లు పొడవున వంద ఫీట్ల వెడల్పుతో పాటు మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసేందుకు గత ఏడాది ప్రభుత్వం పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కార్పొరేషన్ బీజేపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు కొంపల్లి మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ పెట్టుకొని ప్రధాన రోడ్డును వంద ఫీట్ల వెడల్పుతో చేపట్టాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో కార్పొరేషన్ భవిష్యత్తుపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. పాలకులు అధికారులు విస్తారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మహా నగరానికి అతి సమీపంలో ఉండే కార్పొరేషన్ లో అంచెలంచెలుగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకోకుండా తూ..తూ మంత్రంగా ప్రణాళికలు చేయడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రధాన రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ.. వంద ఫీట్ల వెడల్పుతో కార్పొరేషన్ సుందరీకరణకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. జవహర్ నగర్ తన గుండెకాయ అంటూ ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన మాటను మంత్రి మల్లారెడ్డి దాట వేయాలని చూస్తే ఒప్పుకోమన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తితే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేయడం తగదన్నారు. వంద ఫీట్ల వెడల్పు రోడ్డును తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్ అధికారులు నుండి కలెక్టర్ దాకా...
కార్పొరేషన్ అధ్యక్షుడు రంగుల శంకర్ నేత మాట్లాడుతూ.. కార్పొరేషన్ అధికారులు నుండి కలెక్టర్ దాకా ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని వంద ఫీట్ల వెడల్పు రోడ్డును చేపట్టాలని, లేదంటే ఎవరి ప్రయోజనాల కోసం రోడ్డు వెడల్పు తగ్గించే కుట్ర జరుగుతుందో రోడ్డుకు అడ్డుపడుతున్న వారు ఎవరో ప్రజల ముందుంచాలని అధికారులను డిమాండ్ చేశారు. రోడ్డు పనులను నిర్లక్ష్యం చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉందన్నారు. తక్షణమే రోడ్డు పనులను పూర్తి చేయాలని లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధాన రోడ్ లో నిరసన తెలుపుతున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడంతో రాష్ట్ర బీజేపీ నాయకుడు కొంపల్లి మోహన్ రెడ్డి వారిని పరామర్శించి వ్యక్తిగత పూచీకత్తుతో విడిపించారు. ఈ కార్యక్రమంలో పలు బీజేపీ మోర్చా నాయకులు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.