- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేఎం ప్రతాప్, ఆయన తనయుడు కేపీ విశాల్ గౌడ్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కేఎం ప్రతాప్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు.2014 కు పూర్వం మూడు పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కేఎం ప్రతాప్ పనిచేశారు.2014 లో కేఎం ప్రతాప్ టీఆర్ఎస్ లో చేరిన అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన భార్య ను జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించారు.2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్న కుమారుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద ను భారీ మెజారిటీతో గెలిపించారు.
ఆ తర్వాత 2019 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. కేఎం ప్రతాప్ భార్య పద్మ ఓటమికి ఫ్యామిలీ విబేదాలే కారణం అనే టాక్ కుత్బుల్లాపూర్ లో ఉంది.అప్పటి నుంచి కేఎం ప్రతాప్ బీఆర్ఎస్ పార్టీలో సైలెంట్ అయిపోయారు.పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రామగౌడ్ కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.