- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి.. టి.చిరంజీవులు
దిశ, ఘట్కేసర్ : రాష్ట్రంలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో బీసీలు అభ్యర్థులుగా నిలబడి గెలవాలని ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ.చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ లోని జేకే కన్వెన్షన్ హాల్లో పంచాయతీ ఎన్నికలు - బీసీల పాత్ర అంశం పై బీసీ ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ ప్రజలతో కలిసి పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొని సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ నేతలకు గెలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలు ఏకమై బీసీ అభ్యర్థులు గెలిచేందుకు బీసీ కులాల ఐక్యం కావాలని ఆయన కోరారు.
గతంలో పల్లెల్లో పట్టణాల్లో బీసీలకు చైతన్యం లేకపోయిందని, ఇప్పుడు రాజ్యాధికార చైతన్యం వచ్చిందని ఈ నేపథ్యంలో పల్లెలో బీసీ చైతన్యము వెల్లివిరిసేందుకు కృషిచేసి బీసీ అభ్యర్థులు గెలవాలని అన్నారు. బీసీ నేతలను ఐక్యత చేసేందుకు కుల సంఘాల నేతలు కూడా కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలు పార్టీల వారీగా విడిపోకూడదని కచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబించాలని వివరించారు. మాజీ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్రభాకర్, బీసీ నేత చెరుకు సుధాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తే ప్రజలు గెలిపిస్తారని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్రభాకర్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.